కొత్త కారు కొన్న హీరో నిఖిల్.. ఖరీదైనదే..!
Hero Nikhil Bought News Car. దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఆటో బయోగ్రఫీ కారును హీరో నిఖిల్ కొనుగోలు చేశారు
By Medi Samrat Published on 25 Jan 2021 4:10 PM ISTహీరో నిఖిల్ హ్యాపీ డేస్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై రాణిస్తున్నాడు. వరుస అవకాశాలు అందిపుచ్చుకున్న నిఖిల్.."స్వామిరారా", "కార్తికేయ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా"వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ యువ హీరో కరోనా ఆ సమయంలో తాను ప్రేమించిన ప్రేయసి డాక్టర్ పల్లవి వర్మను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు.
ఒకవైపుసినిమాలలో బిజీగా ఉంటూ మరోవైపు తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న నిఖిల్ తాజాగా ఖరీదైన కారును కొన్నాడు. దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఆటో బయోగ్రఫీ కారును కొనుగోలు చేశారు. తాను కారును కొనుగోలు చేసిన విషయాన్ని నిఖిల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తను నటించిన "అర్జున్ సురవరం" అనే సినిమా మంచి విజయం సాధించడంతో తనకుతానుగా ఇచ్చుకున్న బహుమతి ఈ కారని క్యాప్షన్ ఇచ్చాడు.
కరోనా కారణం వల్ల ఈ కారు నా దగ్గరకు రావడం కాస్త ఆలస్యమైందని ఈ సందర్భంగా నిఖిల్ తన కారు గురించి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అంతేకాకుండా ఈ కారుకు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక సినిమాల విషయానికి వస్తే నిఖిల్ కార్తికేయ చిత్రాన్ని సీక్వెల్ గా కార్తికేయ_2 చిత్రం లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రాన్ని దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. ఇదే కాకుండా గీత బ్యానర్స్ పతాకంపై 18 పేజెస్ అనే సినిమాను కూడా చేస్తున్నాడు.