ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో ప్రముఖ సినీ హీరో నాగార్జున భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ఈ భేటీలో నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతం రెడ్డి, నిరంజన్ రెడ్డి సహా మరికొందరు భేటీ అయ్యారని తెలుస్తోంది. భేటీ అనంతరం సీఎం జగన్‌తో కలిసి నాగార్జున మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన వివిధ అంశాలపై సీఎం జగన్‌తో నాగార్జున చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీకి తెలుగు అగ్ర హీరో చిరంజీవి హాజరు కావడం లేదు. దీంతో ఈ సీఎం జగన్ - నాగార్జునల భేటీపై ఆసక్తి అందరికి ఆసక్తి నెలకొంది.
కరోనా విజృంభణతో సినీ పరిశ్రమ గత సంవత్సర కాలంగా సమస్యల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీనికి తోడుగా ఆన్‌లైన్ టికెట్ల సమస్యలు, థియేటర్ల సమస్యలు సినీ పరిశ్రమను గందరగోళంలోకి నెట్టివేశాయనే చెప్పాలి. ఇటీవల సినీ నిర్మాతలు మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. అయినా కూడా సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. సాయి ధరమ్ తేజ్ నటించిన 'రిపబ్లిక్' ఫ్రీ రీలిజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ చేసిన వాఖ్యలు అటు ఏపీ రాజకీయాలపై, సినీ ఇండస్ట్రీపై దుమారం రేపాయి. టాలీవుడ్ సమస్యలపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ పవన్ ప్రసంగించారు.