దిల్ రాజు కుటుంబం నుంచి రాబోతున్న హీరో..

Hero From Dil Raju Family. ప్రముఖ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస్ దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరో రాబోతున్నాడు.

By Medi Samrat
Published on : 12 Feb 2021 6:17 PM IST

Hero From Dil Raju Family

ప్రముఖ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస్ దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరో రాబోతున్నాడు. ఆయనతో నిర్మించే సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించే దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి కొడుకు ఆశిష్ రెడ్డి.. త్వరలో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడట. ఇక షూటింగ్ కూడా మొదలైపోయిందని సమాచారం అందుతుంది. 'హుషారు' వంటి యూత్ ఫుల్ డీసెంట్ హిట్ ను తెరకెక్కించిన శ్రీ హర్ష ఈ చిత్రానికి దర్శకుడు.

ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు ప్రభాస్ నటించిన 'సాహో' అలాగే ఇప్పుడు మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రాలకు పనిచేస్తున్న సినిమాటోగ్రాఫర్ మది ఈ చిత్రానికి పనిచేస్తున్నాడు.ఇక హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం.దీని పై త్వరలోనే క్లారిటీ రానుంది.

ఏమైనా దిల్ రాజు పర్యవేక్షణలో ఈ చిత్రం గ్రాండ్ గా రూపొందుతోందని తెలుస్తుంది. ఈ చిత్రం కనుక హిట్ అయితే ఆశిష్ రెడ్డి కూడా హీరోగా నిలదొక్కుకొని సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతాడు అనడంలో సందేహమే లేదు..మొత్తానికి దిల్ రాజు కుటుంబం నుంచి హీరో వచ్చేశాడు.


Next Story