విశ్వక్ సేన్ పై సీనియర్ హీరో సంచలన వ్యాఖ్యలు
Hero Arjun Sensational Comments On Vishwak Sen. సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమాకు
By Medi Samrat Published on 5 Nov 2022 7:00 PM ISTసీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమాకు ఈ ఏడాది జూన్ లో పూజా కార్యక్రమాలు జరిగాయి. హీరో పవన్ కల్యాణ్ గెస్ట్‌గా వచ్చి సినిమాను లాంఛ్ చేశారు. ఈ చిత్రం రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్రబృందం మూడో షెడ్యూల్‌కు సిద్ధమౌతుంది. ఈ క్రమంలో విశ్వక్ సేన్ ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై సీరియస్ అయిన అర్జున్ సర్జా, విశ్వక్ పై ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు.ఈ చిత్రానికి అర్జున్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు.
తాజాగా అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి విశ్వక్ సేన్‌పై పలు ఆరోపణలు చేశారు. కథ విశ్వక్‌సేన్‌కి బాగా నచ్చిందని చెప్పారు.. రెమ్యునరేషన్ విషయంలోనూ అతను చెప్పిన విధంగానే అగ్రిమెంట్ జరిగిందని.. కానీ కొన్ని వెబ్‌సైట్స్‌లో మా సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయని అన్నారు. నా లైఫ్‌లో విశ్వక్ సేన్‌కి చేసినన్ని కాల్స్ ఎవరికి చేయలేదు. ప్రతిసారి షూటింగ్ వస్తానని చెప్పి ఇబ్బందులు పెడుతుండడం వలన.. జగపతి బాబు లాంటి పెద్ద నటుల డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయని తెలిపారు. ఆ తర్వాత విశ్వక్‌కి నేను చాలా సార్లు కాల్ చేశాను.. అతను పట్టించుకోలేదు. ఇటీవల నా దగ్గర వచ్చి మళ్లీ కథ చెప్పమన్నాడు. చెప్పాను సూపర్ అని అన్నాడు. దీంతొ ఈ నెల 3న షూట్ పెట్టుకున్నాం. రాత్రి 2 గంటల వరకు నాతో టచ్‌లో ఉన్నాడు. ఈ రోజు షూట్ అనగా.. ఉదయం 'నేను రావడం లేదు.. నాకు టైమ్ కావాలి'అని మెసేజ్ చేశాడని.. ఏ మాత్రం కమిట్మెంట్ లేకుండా విశ్వక్ సేన్ ప్రవర్తిస్తూ వచ్చాడని ఆరోపించారు అర్జున్. ఇలాంటి వాతావరణంలో విశ్వక్‌తో నేను సినిమా చేయలేను. ఈ విషయం అందరికీ తెలియాలి అని ప్రెస్ మీట్ పెట్టానని అన్నారు అర్జున్. విశ్వక్ ప్రవర్తన వల్ల నేను ప్రస్తుతం సినిమా ఆపేశాను. వందకోట్లు వచ్చినా నేను విశ్వక్ తో సినిమా చేయనన్నారు అర్జున్. త్వరలోనే కొత్త హీరో, టైటిల్ తో సినిమాను ప్రకటిస్తానని అన్నారు అర్జున్ సర్జా.