సూర్య దగ్గర కాకుండా.. ముంబైలో ఉండడానికి కారణం ఇదే : జ్యోతిక

ప్రముఖ సెలబ్రిటీ జంట సూర్య, జ్యోతిక విడిపోయే అవకాశం గురించి చాలా కాలం పాటు ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి.

By Medi Samrat  Published on  27 Jan 2024 6:30 PM IST
సూర్య దగ్గర కాకుండా.. ముంబైలో ఉండడానికి కారణం ఇదే : జ్యోతిక

ప్రముఖ సెలబ్రిటీ జంట సూర్య, జ్యోతిక విడిపోయే అవకాశం గురించి చాలా కాలం పాటు ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. చాలా సంవత్సరాల పాటు డేటింగ్ తర్వాత జంటగా తమ ప్రయాణాన్ని ప్రారంభించిన వీరిద్దరూ సెప్టెంబర్ 11, 2006న పెళ్లి చేసుకున్నారు. 1999లో "పూవెల్లం కెట్టుప్పర్"తో మొదలైన ఈ జంట ఏకంగా ఏడు చిత్రాలలో కనిపించింది. ఇప్పుడు వీరికి దియా అనే కుమార్తె, దేవ్ అనే కుమారుడు (2010లో జన్మించారు) ఉన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన జ్యోతిక.. కొద్దిరోజుల పాటూ సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు జ్యోతిక.

తాజాగా ఆమె ఈ వదంతులపై స్పందించారు. తనకు సూర్యకు మధ్య ఎలాంటి గొడవులు లేవని జ్యోతిక తెలిపారు. పిల్లల చదువుతోపాటు తను బాలీవుడ్ సినిమాలకు కమిట్ అవ్వడం, నా తల్లిదండ్రుల ఆరోగ్యం బాగొలేకపోవడం వంటి కారణాలతో తాను ముంబైకు షిఫ్ట్ అయినట్లు చెప్పుకొచ్చారు జ్యోతిక. సూర్య చాలా మంచి వ్యక్తి అని, మా ఇద్దరికీ విడాకులు తీసుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. పిల్లల చదువులు పూర్తవ్వగానే తాము చెన్నై తిరిగి వెళ్తామని అన్నారు. తన రెండవ ఇన్నింగ్స్‌లో, జ్యోతిక సూపర్ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళుతున్నారు. జ్యోతిక నటించిన 'సైథాన్' టీజర్ రిపబ్లిక్ డే రోజున విడుదలైంది.

Next Story