ప్రభాస్ తల్లిగా అలనాటి అందాల తార.. ఎవరో తెలుసా?

Hemamalini Acts As Prabhas Mother Role. రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా అతని తల్లి కౌశల్య పాత్రలో అలనాటి బాలీవుడ్ బ్యూటీ డ్రీమ్ గర్ల్ హేమా మాలిని చేస్తున్నారని బీ టౌన్ టాక్ నడుస్తుంది.

By Medi Samrat  Published on  1 Feb 2021 1:03 PM GMT
Hemamalini Acts As Prabhas Mother Role
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ 'బాహుబలి' సీరీస్ తర్వాత జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలపై భారీ అంచనాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఆ మద్య సుజిత్ దర్శకత్వంలో వచ్చిన 'సాహెూ' చిత్రం అనుకున్న అంచనాలు అందుకోలేకపోయారు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తుంది. ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాను చేస్తున్నారు. అంతే కాదు ప్రభాస్ కెరీర్లో మరో ప్రతిష్టాత్మకంగా బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్‌లో ఆదిపురుష్ చిత్రం కూడా చేయనున్నారు.


ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.. ఇందులో రావణుడిగా బాలీవుడ్ స్టార్ సయీఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. మరికొన్ని ముఖ్యపాత్రల గురించి తెలియాల్సి ఉంది. అయితే రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా అతని తల్లి కౌశల్య పాత్రలో అలనాటి బాలీవుడ్ బ్యూటీ డ్రీమ్ గర్ల్ హేమా మాలిని చేస్తున్నారని బీ టౌన్ టాక్ నడుస్తుంది.

ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ సినీ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తుంది. మరోవైపు ప్రభాస్ సరసన సీత పాత్రలో కృతీ సనన్ నటిస్తున్నట్లు సమాచారం. కాకపోతే ఈ విషయాలు మాత్రం అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రాలేదు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రానున్నాయి.


Next Story