చోటా కె నాయుడుకు గట్టి వార్నింగ్ ఇచ్చిన హరీశ్ శంకర్

దర్శకుడు హరీశ్ శంకర్, కెమెరామన్ చోటా కె నాయుడు మధ్య ఉన్న విభేదాలు మీడియా దాకా వచ్చాయి.

By Medi Samrat  Published on  20 April 2024 2:45 PM GMT
చోటా కె నాయుడుకు గట్టి వార్నింగ్ ఇచ్చిన హరీశ్ శంకర్

దర్శకుడు హరీశ్ శంకర్, కెమెరామన్ చోటా కె నాయుడు మధ్య ఉన్న విభేదాలు మీడియా దాకా వచ్చాయి. తాజాగా హరీశ్ శంకర్.. చోటా కె నాయుడికి ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు హరీశ్ శంకర్ ఓ లేఖ రాశారు. ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామన్ తో షూటింగ్ చేద్దాం అన్న ప్రస్తావన వచ్చిందని అయినా కూడా తాను సినిమా పూర్తీ చేశానని తెలిపారు. మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోవాలన్నారు హరీష్ శంకర్.


(వయసులో పెద్ద కాబట్టి )

గౌరవనీయులైన చోటా కె నాయుడు గారికి నమస్కరిస్తూ.... రామయ్య వస్తావయ్య సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది ఈ పదేళ్లలో ఉదాహరణకి మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా నీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానంగా మాట్లాడారు

మీకు గుర్తుందో లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్తో షూటింగ్ చేద్దాం అన్న ప్రస్తావన వచ్చింది కానీ రాజుగారు చెప్పడం మూలంగానో గబ్బర్ సింగ్ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్ ని తీసేస్తున్నాడు... అని పదిమంది పలు రకాలుగా మాట్లాడుకుంటారని మథనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు ఎందుకంటే మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, నా ప్రస్తావన రాకున్నా,

"గబ్బర్ సింగ్" వచ్చినప్పుడు నాది "రామయ్య వస్తావయ్య" వస్తే అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది.

నాకు సంబంధం లేకున్నా,

నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు.

ఇలా చాలాసార్లు జరిగినా నేను మౌనంగానే బాధపడ్డా కానీ నా స్నేహితులు అవ్వచ్చు లేదా నన్ను

అభిమానించే వాళ్ళు అవ్వచ్చు నా ఆత్మ అభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తుంది. మీతో పని చేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను

అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి.

ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి.

కాదు కూడదు మళ్లీ కెలుక్కుంటాను అని అంటే.. ఏరోజైనా తాను సిద్ధమేనంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

Next Story