'భవదీయుడు భగత్‌సింగ్'కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన హరీష్ శంకర్
Harish Shankar About Bhavadeeyudu Bhagat Singh. పవన్ కళ్యాణ్ నూతన సినిమా ‘భవదీయుడు భగత్‌సింగ్’కి సంబంధించిన
By Medi Samrat
పవన్ కళ్యాణ్ నూతన సినిమా 'భవదీయుడు భగత్‌సింగ్'కి సంబంధించిన అధికారిక అప్‌డేట్‌ల కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయంపై అభిమానులు దర్శకుడు హరీష్ శంకర్ కు ట్విటర్ వేదికగా ఎప్పటికప్పుడు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో హరీష్ ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు హరీష్ శంకర్ 22 సెకన్ల ఆడియోను ట్విట్టర్‌లో విడుదల చేశారు. "సినిమాలకు టైమింగ్ ఎంత ముఖ్యమో సినిమాల్లో టైమింగ్ కూడా ముఖ్యమని నేను నమ్ముతున్నాను. మా ప్రాజెక్ట్ గురించిన సమాచారం అతి త్వరలో అధికారికంగా తెలియజేయబడుతుంది. అన్ని పనులు జరుగుతున్నాయి. మీ సహనానికి చాలా థ్యాంక్స్'' అని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు.
— Harish Shankar .S (@harish2you) February 6, 2022
ట్విట్టర్‌లో 'భవదీయుడు భగత్‌సింగ్' ఆగిపోతున్నట్లు పుకార్లు రావడంతో.. గాలి వార్తలను క్లియర్ చేసే బాధ్యతను దర్శకుడు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' చిత్రానికి దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 'భవదీయుడు భగత్‌సింగ్' కోసం ఈ బ్లాక్‌బస్టర్ జంట కలిసి పనిచేస్తుండటంతో అభిమానులు ఆ ఉత్సాహాన్ని అదుపు చేసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీర మల్లు' సినిమాలో నటిస్తున్నాడు. మరోవైపు హరీష్ శంకర్ 'భవదీయుడు భగత్‌సింగ్' కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. అతను అల్లు అర్జున్ హీరోగా మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.