1200 కు పైగా థియేటర్లలో విడుదల అవుతున్న హనుమాన్

సంక్రాంతి సినిమాలకు సంబంధించి కాస్త కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ప్రశాంత్ వర్మ-తేజ సజ్జా కాంబినేషన్ లో వస్తున్న హనుమాన్ సినిమాకు

By Medi Samrat  Published on  5 Jan 2024 4:28 PM IST
1200 కు పైగా థియేటర్లలో విడుదల అవుతున్న హనుమాన్

సంక్రాంతి సినిమాలకు సంబంధించి కాస్త కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ప్రశాంత్ వర్మ-తేజ సజ్జా కాంబినేషన్ లో వస్తున్న హనుమాన్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరకడం లేదనే ప్రచారం సాగుతూ ఉంది. అయితే తెలుగులో కాకపోయినా హిందీలో ఈ సినిమాకు భారీ ఎత్తున థియేటర్లు దక్కుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. హనుమాన్ సినిమాపై హిందీ బ‌య్య‌ర్లు చాలా ఆశ‌లు పెట్టుకున్నారని.. అక్క‌డ 1200 థియేట‌ర్ల‌లో హనుమాన్ ను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు. కానీ తెలుగులో మాకు కేవ‌లం 50 థియేట‌ర్లే దొరుకుతున్నాయని.. దీంతో మాకు చాలా నష్టం వస్తోందని తెలిపారు. 50 థియేట‌ర్ల కోసం ఆలోచిస్తూ..1200 థియేట‌ర్ల‌ని వ‌దులుకోలేం క‌దా అని అన్నారు.

ఓ ఇంటర్వ్యూలో హనుమంతుడి కళ్ల గురించి ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో హనుమంతుడి కళ్ల కోసం మెగాస్టార్ చిరంజీవి కళ్లను తీసుకున్నామని తెలిపారు. సుమారు రెండు సంవత్సరాలు, మేము హనుమంతుని ఎలా చూపించాలో చర్చించాము.. ప్రేక్షకులు సంక్రాంతి వరకు వెయిట్ చేసి పెద్ద స్క్రీన్స్‌పై హనుమాన్ ఫీల్ ను అనుభవించాలన్నదే నా కోరిక అని అన్నారు.

Next Story