100 కోట్ల షేర్ దిశగా దూసుకుపోతున్న హనుమాన్
హనుమాన్ సినిమా.. తెలుగులో 100 కోట్ల షేర్ దిశగా దూసుకుపోతోంది.
By Medi Samrat Published on 14 Jan 2024 5:57 PM ISTహనుమాన్ సినిమా.. తెలుగులో 100 కోట్ల షేర్ దిశగా దూసుకుపోతోంది. సూపర్ హీరో చిత్రం హనుమాన్ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై పాజిటివ్ రివ్యూలను దక్కించుకుంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన వసూళ్లు సాధిస్తూ ఉంది. హనుమాన్ సినిమా తెలుగులో 100 కోట్ల షేర్ దిశగా దూసుకుపోతూ ఉంది. . మొదటి రోజు 24 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిన హనుమాన్.. 2వ రోజు భారీ గ్రోత్‌ని కనబర్చాడు. ఈ సినిమా అద్భుతమైన ట్రెండ్‌ని చూసి ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి.
సినిమా అందరి అంచనాలకు మించి వసూళ్లు సాధిస్తుండడంతో అన్ని షోలు హౌస్ ఫుల్‌గా నమోదు అవుతున్నాయి. రాబోయే 3-4 రోజుల అడ్వాన్స్ బుకింగ్‌లు ఇప్పటికే అద్భుతంగా ఉన్నాయి. పండుగ హాలిడేస్ తర్వాత కూడా సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తే మాత్రం.. సినిమా ఫుల్ రన్‌లో 100 కోట్ల షేర్ వసూలు చేయగలదు. ఇక హిందీ మార్కెట్ లో కూడా హనుమాన్ ను ప్రేక్షకులు ఆదరిస్తూ ఉన్నారు. హిందీ మార్కెట్ లో ఈ వారం సినిమాల పోటీ లేకపోవడం, గుంటూరు కారం, సైంధవ్ సినిమాలకు ప్రతికూలమైన సమీక్షలు రావడం హనుమాన్ సినిమాకు అనుకూలంగా పని చేశాయి.