'హనుమాన్' క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతంటే.?

బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించిన సినిమా హనుమాన్. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ తో సినిమా థియేట్రికల్ రన్ ను ముగించింది.

By Medi Samrat  Published on  2 March 2024 4:51 PM IST
హనుమాన్ క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతంటే.?

బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించిన సినిమా హనుమాన్. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ తో సినిమా థియేట్రికల్ రన్ ను ముగించింది. మీడియం బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా పెద్ద స్టార్ హీరోల చిత్రాల తరహాలో వసూళ్లు రాబట్టింది. నైజాంలో, ఈ చిత్రం 64 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా 82 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటకలో 24 కోట్ల గ్రాస్. కేరళ- తమిళనాడులో కలిపి దాదాపు 4 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. నార్త్ ఇండియాలో ఈ సినిమా 62 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా 237 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ఓవర్సీస్ లో 57 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా క్లోజింగ్ గ్రాస్ 294 కోట్లని చెప్పుకోవచ్చు. ఈ సినిమా టాలీవుడ్‌లో టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది.

హనుమాన్ సినిమా OTT విడుదల తేదీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మార్చి 8న జీ5లో రాబోతోంది. ఈ సినిమా సీక్వెల్ గా జై హనుమాన్ అని ఇప్పటికే ప్రకటించడంతో OTT రెస్పాన్స్ కూడా ఈ చిత్ర బృందానికి చాలా కీలకం. జై హనుమాన్ సినిమా పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో రానుందని ప్రశాంత్ వర్మ ప్రకటించారు. శ్రీరామ నవమికి ​​ఫస్ట్ లుక్ వచ్చే అవకాశం ఉంది.

Next Story