హీరో రామ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు 'వారియర్' సినిమా మూవీ మేకర్స్..! లింగుసామి దర్శకత్వంలో ప్రస్తుతం 'ది వారియర్' అనే మూవీలో నటిస్తున్నాడు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే సాంగ్స్, పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ కు టైమ్ అయిందని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను ఈనెల 14 సాయంత్రం 5 గంటల 31 నిమిషాలకు విడుదల చేయనున్నారు. మే 15 రామ్ పుట్టినరోజు కావడంతో అభిమానులను టీజర్ తో పలకరించనున్నారు.
ప్రముఖ తమిళ మాస్ డైరెక్టర్ లింగుసామి తొలి సారిగా తెలుగులో చేస్తున్న ఈ సినిమా కావడం, రామ్ ఎప్పుడూ లేని విధంగా పోలీసు పాత్రలో కనిపిస్తూ ఉండడంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్లస్ అవ్వనుంది. శ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కృతిశెట్టి కథానాయికగా, ఆది పినిశెట్టి విలన్ గా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు.