'సర్కారు వారి పాట' సూపర్ స్టార్ సూపర్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్..

Good News For Mahesh Babu Fans. ఇక సూపర్ స్టార్ మహేష్ "సరిలేరు నీకెవ్వరూ" లాంటి మాస్ హిట్ తరువాత ఎన్నో అంచనాలతో

By Medi Samrat  Published on  24 Feb 2021 7:45 PM IST
Good News For Mahesh Babu Fans

ఇక సూపర్ స్టార్ మహేష్ "సరిలేరు నీకెవ్వరూ" లాంటి మాస్ హిట్ తరువాత ఎన్నో అంచనాలతో చేస్తున్న చిత్రం "సర్కారు వారి పాట ". ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు ఏమేం కావాలో అన్నీ ఎలివేషన్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయట.ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే మొన్నటి వరకు దుబాయ్ లో జరిగింది. ఇప్పుడు ఇండియాకు వచ్చిన తర్వాత నెక్ట్స్ షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు పరశురామ్. ఆర్థిక నేరాల చుట్టూ కథ అల్లుకుంటున్నాడు ఈ దర్శకుడు.

కచ్చితంగా ఈ సినిమాతో మరో సంచలన విజయం అందుకుంటానని చెప్తున్నాడు ఈయన. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ బయటికి వచ్చింది. ఇందులో మహేష్ అభిమానులు కోరుకుంటున్న ప్రతీ అంశంతో పాటు మాస్ కమర్షియల్ అంశాలు కూడా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు పరశురామ్. అన్నింటికంటే ప్రధానంగా డాన్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు మహేష్. చాలా ఏళ్ళ తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ చేసిన డాన్సులకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

సరిలేరు నీకెవ్వరులో మైండ్ బ్లాక్ పాటలో అదిరిపోయే స్టెప్పులు వేశాడు మహేష్ బాబు. ఈ పాటకు శేఖర్ కొరియోగ్రఫీ చేశాడు. ఇప్పుడు సర్కారు వారి పాటలో మరోసారి శేఖర్ కొరియోగ్రఫీలో అదిరిపోయే డాన్స్ సాంగ్ ఉండబోతుంది. దీని కోసం తమన్ కూడా మాంచి బీట్ సాంగ్ ఇచ్చాడని తెలుస్తుంది. ఈ పాట రికార్డింగ్ కూడా అయిపోయింది. ఇక షూట్ చేయడమే తరువాయి.ఇక చూడాలి ఈ సాంగ్ కూడా సూపర్ స్టార్ అభిమానులని ఉర్రూతలూగిస్తుందో లేదో...


Next Story