పచ్చబొట్టుగా 'సన్నీ లియోన్' పేరు.. అది చూసి ఏమి చెప్పిందంటే..

Good Luck Finding A Wife Sunny Leone Told This Man. సన్నీ లియాన్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

By Medi Samrat
Published on : 17 March 2022 9:00 PM IST

పచ్చబొట్టుగా సన్నీ లియోన్ పేరు.. అది చూసి ఏమి చెప్పిందంటే..

సన్నీ లియాన్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆమె మీద అభిమానాన్ని పలు రూపాల్లో చూపెడుతూ ఉంటారు. తాజాగా ఓ అభిమాని సన్నీ మీద అభిమానంతో ఏకంగా పచ్చ బొట్టు పొడిపించుకున్నాడనే విషయాన్ని సన్నీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో నటి సన్నీ లియోన్, "ఇక్కడకు రండి, ఇది చూడండి" అని చెప్పింది. అందులో, సన్నీ తన పక్కన నిలబడి ఉన్న అభిమాని చేతిలోకి జూమ్ చేయమని కోరింది. అప్పుడు అభిమాని తన చేతిపై సన్నీ పేరును టాటూగా వేయించుకున్నాడు, రెండు చిన్న హృదయాలతో పాటూ 'సన్నీ లియోన్' అని కర్సివ్‌లో వ్రాయబడ్డాయి. "So amazing, thank you so much," అని సన్నీ అతనితో చెప్పింది. "మీరు నన్ను ఎప్పటికీ ప్రేమిస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మీకు వేరే మార్గం లేదు. భార్య దొరకాలని కోరుకుంటూ ఉన్నాను" అని చెప్పింది సన్నీ.

సన్నీ లియోన్, అసలు పేరు కరేంజిత్ కౌర్ వోహ్రా, కెనడియన్ నటి. ఆమె కెరీర్ అడల్ట్ ఫిల్మ్ స్టార్‌గా ప్రారంభమైంది. ఇప్పుడు బాలీవుడ్‌లో నటిస్తోంది. 40 ఏళ్ల సన్నీ 2011లో బిగ్ బాస్ 5లో కనిపించింది. ఆ తర్వాతి సంవత్సరం జిస్మ్ 2లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. జాక్‌పాట్, రాగిణి MMS 2, ఏక్ పహేలీ లీలా, మస్తీజాదే వంటి సినిమాల్లో సన్నీ నటించింది.

సన్నీ అక్షయ్ కుమార్ 'సింగ్ ఈజ్ బ్లింగ్' లో అతిధి పాత్రలో నటించింది. షారుఖ్ ఖాన్ 'రయీస్', అజయ్ దేవగన్ 'బాద్షాహో' సహా ఇతర చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించింది. సన్నీ సినిమాలు కొన్ని విడుదలకు సిద్ధమవుతూ ఉండగా.. ప్రస్తుతం తెలుగులో 'మంచు విష్ణు' సినిమాలో నటిస్తోంది.

















Next Story