జంతువుల సినిమా 100 కోట్లు కొల్లగొట్టింది

ఇటీవలి కాలంలో 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టాలని బాలీవుడ్ సూపర్ స్టార్స్ ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు.

By Medi Samrat  Published on  13 April 2024 8:41 PM IST
జంతువుల సినిమా 100 కోట్లు కొల్లగొట్టింది

ఇటీవలి కాలంలో 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టాలని బాలీవుడ్ సూపర్ స్టార్స్ ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే బాలీవుడ్ సినిమాలకు పెద్దగా ఆదరణ దక్కడం లేదు. అలాంటిది ఓ హాలీవుడ్ సినిమా తాజాగా భారతదేశంలో 100 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. గాడ్జిల్లా x కాంగ్ ప్రపంచవ్యాప్తంగా మంచి బజ్, హైప్ మధ్య విడుదలైంది. ఈ ప్రాజెక్ట్ కోసం భారతదేశంలో కూడా చాలా మంది ఎదురుచూస్తూ ఉన్నారు. భారతదేశంలో ఈ సినిమా అద్భుతంగా రన్ అవుతోంది.. ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ సాధించిన హాలీవుడ్ సినిమాల క్లబ్‌లో చేరింది.

ఈ చిత్రానికి తమిళనాడు అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. అక్కడ 25 కోట్లకు పైగా గ్రాస్‌ని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో గాడ్జిల్లా x కాంగ్ దాదాపు 15 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటకలో 10 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయగా.. కేరళలో 5 కోట్లకు పైగా గ్రాస్‌ని తెచ్చిపెట్టింది. దక్షిణ భారతదేశంలో మాత్రమే గాడ్జిల్లా x కాంగ్ 55 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ వీకెండ్‌లో మంచి బుకింగ్స్‌ సొంతం చేసుకుంది. ఎన్నో బాలీవుడ్ సినిమాల కంటే ఈ సినిమాను చూడడానికే అభిమానులు ముందుకు వస్తున్నారు.

Next Story