పుట్టిన‌రోజు నాడు ఫ్యాన్స్‌కు పూన‌కాలే.. 'రావణాసుర' గ్లింప్స్‌ సిద్ధం చేస్తున్న మాస్ మహారాజా..!

Glimpse of Ravanasura On JAN 26th. ధమాకా సినిమాతో రూ. 100 కోట్ల మార్కెట్‌లోకి అడుగుపెట్టి మాస్ మహారాజా రవితేజ మొత్తానికి

By Sumanth Varma k  Published on  24 Jan 2023 12:15 PM GMT
పుట్టిన‌రోజు నాడు ఫ్యాన్స్‌కు పూన‌కాలే.. రావణాసుర గ్లింప్స్‌ సిద్ధం చేస్తున్న మాస్ మహారాజా..!

ధమాకా సినిమాతో రూ. 100 కోట్ల మార్కెట్‌లోకి అడుగుపెట్టి మాస్ మహారాజా రవితేజ మొత్తానికి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న రావణాసుర’ మూవీ నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా రావణాసుర సినిమా గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. రవితేజ గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక రావణాసుర గ్లింప్స్ విడుదల తర్వాత ఈ సినిమాకి సంబంధించి వరుస ప్రమోషన్లు మొదలు కానున్నాయి. ప్రస్తుతం ఈ పాటల చిత్రీకరణ జరుగుతుంది.

కాగా త్వరలోనే ఈ సాంగ్స్ షూట్ ను పూర్తి చేసుకుని 2023 సమ్మర్ కి ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సుధీర్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మరి రవితేజ "రావణాసుర" సినిమాతో తన సక్సెస్ స్ట్రీక్ ను కంటిన్యూ చేస్తాడా లేడా అనేది చూడాలి. అన్నట్టు పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజతో పాటు యంగ్ హీరో సుశాంత్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక రవితేజ సరసన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, పూజిత, మేఘా ఆకాశ్, అను ఇమ్మన్యూయేల్, దక్షా నగర్కార్ హీరోయిన్స్ గా నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.

Next Story
Share it