పోర్న్ రాకెట్ లో హీరోయిన్ పేరు.. అమాయకురాలట
Gehana Vasisth is being made a victim by vested interests. పోర్న్ వీడియో రాకెట్ కేసులో నటి, మోడల్ గెహ్నా వశిష్ట్
By Medi Samrat Published on 8 Feb 2021 7:06 PM ISTపోర్న్ వీడియో రాకెట్ కేసులో నటి, మోడల్ గెహ్నా వశిష్ట్ శనివారం అరెస్టవ్వడం కలకలం రేపిన సంగతి తెలిసిందే..! పోర్న్ వీడియోల చిత్రీకరణ, ఆ వీడియోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయటంలో గెహ్నా పాత్ర ఉన్నదన్న అనుమానంతో అరెస్ట్ చేశారు. దాదాపు 87 వీడియోలను ఆమె తన వెబ్‌సైట్లో ఉంచినట్లు ఆధారాలు లభించాయి. క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం ఆమెను సిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు బుధవారం వరకు పోలీస్ కస్టడీ విధించింది. ఆమె సినిమాల్లో అవకాశాల కోసం కష్టాలు పడుతున్న నటులను టార్గెట్ చేసేదని పోలీసులు చెబుతూ ఉన్నారు.
ఔత్సాహిక నటులను ట్రాప్ చేసి వారిని రూ.15 వేలు, రూ. 20 వేల కోసం పోర్న్ వీడియోలలో నటించేలా చేసేదని.. అలా 87 పోర్న్ వీడియోలను చిత్రీకరించిన ఆమె వాటిని తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేదని, ఆ వీడియోలు చూడాలనుకునే వారి వద్ద నుంచి సబ్‌స్క్రిప్షన్ ఫీజు కింద రూ. 2 వేలు వసూలు చేసేదని వెల్లడించారు. అయితే గెహ్నా మాత్రం తనకు ఈ పోర్న్ రాకెట్ లో ఎలాంటి సంబంధం లేదని అంటూ ఉన్నారు. గెహ్నా వశిష్ట్ అలియాస్ వందనా తివారీ అమాయకురాలని గెహ్నా ప్రెస్, లీగల్ టీం చెబుతోంది. పోర్న్ రాకెట్‌తో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని.. ప్రత్యర్థులు ఆమెను అపఖ్యాతిపాలు చేయటానికే ఈ కేసులో ఇరికించారని అంటున్నారు.
ముంబై, మలద్‌లోని మల్వానీ ఏరియాలోని ఓ బంగ్లాలో పోర్న్ వీడియో చిత్రీకరణ జరుగుతోందని శుక్రవారం క్రైం బ్రాంచ్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సదరు బంగ్లాపై పోలీసులు రైడ్ చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నటులు, ఓ లైట్ మ్యాన్, మహిళా ఫొటోగ్రాఫర్, గ్రాఫిక్ డిజైనర్ ఇందులో ఉన్నారు.
ఫిల్మీ దునియా' సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయమైన గెహ్నా పలు తెలుగు సినిమాల్లోనూ నటించారు. 2007లో వచ్చిన ఆపరేషన్ దుర్యోధనలో ఐటమ్ సాంగ్ చేశారు. ఆపరేషన్ దుర్యోధన 2, అనుకున్నది ఒకటి అయినది ఒకటి, నమస్తే, 33 ప్రేమ కథలు, ఐదు, ప్రేమించు పెళ్లాడు, బీటెక్ లవ్ స్టోరీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె పరిచయమే.