అవును.. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు..!

Gautham Karthik, Manjima Mohan get married in Chennai. హీరో గౌతమ్‌ కార్తిక్‌, నటి మంజిమా మోహన్‌ పెళ్లి చేసుకున్నారు.

By Medi Samrat  Published on  28 Nov 2022 8:30 PM IST
అవును.. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు..!

హీరో గౌతమ్‌ కార్తిక్‌, నటి మంజిమా మోహన్‌ పెళ్లి చేసుకున్నారు. గతకొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ సోమవారం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో చెన్నైలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వీరి వివాహనికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మణిరత్నం, గౌతమ్‌మీనన్, వెంకట్‌ ప్రభు, ఐశ్వర్య రజనీకాంత్‌, శివ కార్తికేయన్‌, అశోక్ సెల్వన్, ఆది పినిశెట్టి, నిక్కీ గెల్రాని వంటి స్టార్‌లు ఈ వేడుకకు వచ్చారు. వీరిద్దరూ కలిసి 2019లో 'దేవరత్తం' అనే సినిమాలో కలసి నటించారు. అప్పటి నుండి వీళ్ళ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కాగా స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇటీవలే మంజిమా తన రిలేషన్‌ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. మంజిమా మోహన్ తెలుగులో నాగచైతన్య సరసన 'సాహసం శ్వాసగా సాగిపో' అనే సినిమాలో నటించింది. 'కడలి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన గౌతమ్‌ కార్తిక్‌ ప్రస్తుతం రెండు సినిమాలో బిజీగా ఉన్నాడు.

వీరిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. పలువురు ప్రముఖులు, అభిమానులు ఈ జంట సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ అభినందనలు చెబుతున్నారు. మంజిమ, గౌతమ్ తమ బంధాన్ని ఇన్‌స్టాగ్రామ్ లో అఫీషియల్‌గా అక్టోబర్ 31 న ప్రకటించారు. గత మూడు సంవత్సరాలుగా ఒకరినొకరు ఇష్టపడుతూ ఉన్నామని అభిమానులకు వెల్లడించారు.


Next Story