వెన్నులో వణుకు పుట్టిస్తున్న రాయ్ లక్ష్మీ 'గర్జన'..

Garjana Movie Teaser Released. రాయ్ లక్ష్మీ.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

By Medi Samrat  Published on  16 Dec 2020 7:00 AM GMT
వెన్నులో వణుకు పుట్టిస్తున్న రాయ్ లక్ష్మీ గర్జన..

రాయ్ లక్ష్మీ.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా బాగా ప‌రిచ‌యం ఈ ర‌త్తాలు. ఆ మ‌ధ్య మెగా బ్ర‌ద‌ర్స్‌తో చిందేసి టాలీవుడ్ హాట్ టాపిక్‌గా మారిపోయింది‌. అందం, అభిన‌యం ఉన్న‌ప్ప‌టికి ఎందుక‌నో అవ‌కాశాలు రావ‌డం లేదు. దీంతో అప్పుడు మ‌ల‌యాళ‌, త‌మిళ చిత్రాల‌పై దృష్టి సారించింది. తాజాగా అమ్మ‌డు న‌టిస్తున్న చిత్రం గ‌ర్జ‌న‌. ఈ సినిమాలో లక్ష్మీ రాయ్ కి జోడిగా శ్రీరామ్‌ నటించారు. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

కొత్తగూడెం తూర్పు అటవీ ప్రాంతంలో 45 ఏళ్ల వ్యవసాయ కూలీని పులి చంపిందనే వాయిస్ ఓవర్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది. ఓ ఇంట్లోకి పులి ప్రవేశించడం.. దాని నుండి తప్పించుకోవడానికి కథానాయిక, ఆమె స్నేహితురాలు, చిన్న పాప ఎటువంటి ఇబ్బందులు పడ్డారు. అటవీ అధికారి ఆ పులిని చంపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారనేది మోషన్ పోస్టర్లో వివరంగా చూపించారు. ఈ టీజర్‌ కాస్త భయానకంగా ఉంది.

జె.పార్థీబన్ దర్శకత్వంలో జాగ్వార్ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. దేవ్ గిల్, నైరా, వషన్ని, ఆరోహి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. మ్యూజిక్ అరుల్ దేవ్ అందించారు. ఎడిటర్ గా ఆర్.సుదర్శన్ పని చేశారు. ఆర్ట్ డైరెక్టర్ గా మిలన్ పనిచేశారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ గా సురేశ్ కొండెటి చెయ్యడం విశేషం. ఈ చిత్రానికి బి వినోద్ జైన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.Next Story
Share it