ఎలక్షన్స్ అయిపోగానే.. థియేటర్లలో సందడి చేయనున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

గామి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విశ్వక్ సేన్ మరో సినిమాతో త్వరలోనే థియేటర్లలో సందడి చేయనున్నాడు.

By Medi Samrat  Published on  16 March 2024 7:45 PM IST
ఎలక్షన్స్ అయిపోగానే.. థియేటర్లలో సందడి చేయనున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

గామి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విశ్వక్ సేన్ మరో సినిమాతో త్వరలోనే థియేటర్లలో సందడి చేయనున్నాడు. అదే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. తాజాగా ఆ సినిమా విడుదలకు సంబంధించి మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రం మే 17, 2024న గ్రాండ్‌గా విడుదల కానుంది. భారత ఎన్నికల సంఘం (ECI) ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని ప్రకటించింది. మేకర్స్ పోలింగ్ అయిపోగానే విడుదల తేదీని ఎంచుకున్నారు. మే 17 నాటికి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రాజకీయాలకు సంబంధించిన ఊపు తగ్గుతుంది. ఆ సమయంలో సినిమాల విడుదలకు సరైన సమయం అవుతుంది.

డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి, అంజలి ఈ సినిమాలో కథానాయికలు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ప్రకటించారు.

Next Story