గేమ్ ఛేంజర్ ట్రైలర్ చూస్తే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా అనిపిస్తోంది. రామ్ చరణ్ అభిమానులు, ఇతర సినీ ప్రేమికులు కూడా గేమ్ ఛేంజర్ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలైన గేమ్ ఛేంజర్ ట్రైలర్ తప్పకుండా అంచనాలను పెంచేసింది. చరణ్‌కు జోడిగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ నటించిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించారు. దర్శకుడు శంకర్ భారీ ఎత్తున సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ డబుల్ యాక్షన్ లో కనిపించనున్నారు. తండ్రీకొడుకు పాత్రల్లో రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో రామ్ చరణ్ కనిపించారు. ఈ సంక్రాంతికి తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం చిత్ర బృందంలో ఉంది.