గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్ బెనిఫిట్ షో టికెట్‌ ధ‌ర‌ల‌ వివరాలివే.!

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్‌ కు రిలీజ్ కాబోతోంది.

By Medi Samrat  Published on  31 Dec 2024 4:54 PM IST
గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్ బెనిఫిట్ షో టికెట్‌ ధ‌ర‌ల‌ వివరాలివే.!

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్‌ కు రిలీజ్ కాబోతోంది.గేమ్ ఛేంజర్ కోసం టీమ్ ఆంధ్ర ప్రదేశ్ లో 1 AM షోలను ప్లాన్ చేస్తోంది. టీమ్ GSTతో సహా టిక్కెట్ ధర ₹600కి దరఖాస్తు చేసింది. డాకు మహారాజ్ సినిమా బృందం GSTతో సహా టిక్కెట్ ధర ₹500తో 4 AM షోలకు సిద్ధమవుతోంది.

తరువాతి షోల కోసం, గేమ్ ఛేంజర్ బృందం సింగిల్ స్క్రీన్‌లకు ₹135, మల్టీప్లెక్స్‌లకు ₹180 హైక్ కావాలని దరఖాస్తు చేసింది. డాకు మహారాజ్ విషయానికి వస్తే, GSTతో సహా సింగిల్ స్క్రీన్‌లకు ₹110, మల్టీప్లెక్స్‌లకు ₹135 పెంపు ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా అర్ధరాత్రి విడుదల ఉండకపోవచ్చు. ఈ సినిమా బృందం సింగిల్ స్క్రీన్‌లకు ₹75, మల్టీప్లెక్స్‌లకు ₹100 హైక్ కోసం దరఖాస్తు చేసింది.

Next Story