అప్పుడే లాభాల బాట పట్టిన విశ్వక్ సేన్ సినిమా

విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గామి' సినిమా 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 20.30 Cr+ గ్రాస్ వసూలు చేసి లాభాల్లోకి వచ్చిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు

By Medi Samrat  Published on  11 March 2024 6:15 PM IST
అప్పుడే లాభాల బాట పట్టిన విశ్వక్ సేన్ సినిమా

విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గామి' సినిమా 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 20.30 Cr+ గ్రాస్ వసూలు చేసి లాభాల్లోకి వచ్చిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా మారబోతోంది. పరిమిత బడ్జెట్‌తో అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమా మంచి టాక్‌ను అందుకుంది. గామి మూడు రోజుల రన్‌లో ప్రపంచవ్యాప్తంగా 20.30 Cr+ వసూళ్లు సాధించింది. ఇది అన్ని ప్రాంతాల్లోని కొనుగోలుదారులందరికీ లాభదాయకమైన వెంచర్‌గా మారింది.

రెండు రోజుల్లోనే చాలా ఏరియాల్లో బ్రేక్‌ఈవెన్‌ను అందుకున్న ఈ సినిమా మిగతా జోన్లలో మూడో రోజున లాభాలను అందుకుంది. ఈ చిత్రం USAలో హాఫ్ మిలియన్ మార్క్‌కు చేరింది. విమర్శకుల ప్రశంసలను పొందడమే కాకుండా, గామి పెద్ద కమర్షియల్ హిట్‌గా మారుతోంది. కొన్నేళ్లుగా ఈ సినిమా టీమ్ పడ్డ కష్టం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రూపంలో మంచి స్పందన వస్తూ ఉంది.

Next Story