ప్రభాస్ 'ఆదిపురుష్' సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

Fire Accident In Adhipurush Sets. ప్రభాస్ హీరోగా తెర‌కెక్కుతున్న‌ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్' సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

By Medi Samrat  Published on  2 Feb 2021 8:24 PM IST
Fire Accident In Adhipurush Sets.

ప్రభాస్ హీరోగా తెర‌కెక్కుతున్న‌ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్' సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సినిమా షూటింగ్ ఈరోజే ముంబైలో ప్రారంభమైంది. ముంబైలోని గోరేగావ్ ప్రాంతం ఇనార్బిట్ మాల్ స‌మీపంలోని రెట్రో గ్రౌండ్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. షూటింగ్‌లో మొత్తం 50 నుంచి 60 మంది వ‌ర‌కూ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అయితే.. సాయంత్రం 4:13 గంటల సమయంలో సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను అదుపుచేయడానికి ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడక‌పోవ‌డంతో చిత్ర‌యూనిట్ ఊపిరి పీల్చుకుంది.

.




Next Story