సోషల్ మీడియాలో అఖిల్, వైష్ణవ్ తేజ్‌ల‌‌ ఫ్యాన్ వార్..!

Fanwar Between AKhil And Vaishnav Tej. హీరో వైష్ణవ్‌ తేజ్‌.. అక్కినేని కాంపౌండ్‌ నుంచి వచ్చిన అఖిల్‌ మధ్య ఇప్పుడు ఫ్యాన్‌ వార్‌ నడుస్తోంది

By Medi Samrat  Published on  17 Feb 2021 8:37 AM GMT
Fanwar Between AKhil And Vaishnav Tej
సోషల్‌ మీడియా ఫ్యాన్ వార్స్ అనేవి ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య చాలా కామన్ అయిపోయాయి. ఒక హీరోకి ఇంకో హీరోకి మధ్యన పోటీలు జరుతుంటాయి. ఆ హీరోలకి సంబంధించి ఏదైనా సినిమా వస్తోందన్నా, టీజర్‌, ట్రైలర్‌, పోస్టర్‌, టైటిల్‌ ఇలా ఏది వస్తున్నా ఫ్యాన్స్‌ వార్‌ జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఇది హెల్దీగా ఉంటే, ఇంకొన్నిసార్లు వెగటు పుట్టిస్తోంది. తాజాగా మరోసారి సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ వార్‌ మొదలైంది. అయితే ఈసారి ఒక సినిమా హీరో, ఒక్క సినిమా కూడా హిట్‌ కొట్టని హీరో ఫ్యాన్స్‌ మధ్య. ఇప్పటికి ఈ వార్‌ చూడటానికి సరదాగా ఉన్నా, తర్వాతర్వాత ఆ హీరోల సినిమాలు వచ్చినప్పుడు ఇంకేమవుతుందో అని ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.


మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా వచ్చిన హీరో వైష్ణవ్‌ తేజ్‌.. అక్కినేని కాంపౌండ్‌ నుంచి వచ్చిన అఖిల్‌ మధ్య ఇప్పుడు ఫ్యాన్‌ వార్‌ నడుస్తోంది. 'ఉప్పెన'కు ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వస్తుండటం ఈ వార్‌కి కారణమైంది. అఖిల్‌ హీరోగా పరిచయం అయ్యి దాదాపు ఆరేళ్లు అయ్యింది. అయినా ఇంకా హిట్‌ రాలేదు. రీఎంట్రీ, రీరీ ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు రీరీరీ ఎంట్రీకి రెండీ అవుతున్నాడు. మరోవైపు వైష్ణవ్‌తేజ్‌ 'ఉప్పెన'తో మంచి సూపర్ హిట్ కొట్టి ఆకట్టుకున్నాడని పరిశీలకులు అంటున్నారు.

ఈ విషయంలో అఖిల్ కంటే వైష్ణవ్ తేజ్ చాలా మేలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో అఖిల్, వైష్ణవ్ తేజ్‌ మద్య పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే కచ్చితంగా వైష్ణవ్‌ తేజ్‌దే పైచేయి అవుతుందని సోషల్‌ వార్‌ సారాంశం. అయితే అక్కినేని అభిమానులు మాత్రం ఇప్పుడు అఖిల్‌ ప్లాపుల్లో వున్నా భవిష్యత్తులో స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకోవడం ఖాయం అంటున్నారు.




Next Story