తార‌క్ త్వ‌ర‌గా కోలుకోవాలి.. అభిమానుల పూజలు

Fans Prayers About NTR For Speedy Recovery. కౌతాళం మండలం మెళిగనూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఎన్టీఆర్ కోలుకోవాలని అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు.

By Medi Samrat  Published on  17 May 2021 7:38 AM GMT
Fans Prayers About NTR

కరోనా బారిన పడిన టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కోలుకోవాలంటూ అభిమానులు పూజలు నిర్వహించారు. కర్నూలు జిల్లాలోని కౌతాళం మండలం మెళిగనూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఎన్టీఆర్ కోలుకోవాలని అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి ఆలయం ముందు 100 టెంకాయలు కొట్టారు.

ఇదిలావుంటే.. ఎన్టీఆర్ ఇటీవ‌ల‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని తారక్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. అయితే ఎవరు కూడా టెన్షన్ పడకండి అని చెప్పారు. ప్రస్తుతానికి ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. నేను, నా కుటుంబం ఐసోలేషన్ లో ఉన్నామని.. వైద్యులు చెప్పిన అన్ని సలహాలను పాటిస్తూ ఉన్నామని తెలిపారు. ఇటీవలి కాలంలో తనకు దగ్గరగా వచ్చిన వారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.

ఇక‌ తారక్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్టుల్లో ఎన్టీఆర్ నటించబోతున్న‌ట్లు తెలుస్తోంది. త‌న‌కు జ‌న‌తా గ్యారేజ్ లాంటి హిట్ ఇచ్చిన కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తుండ‌గా.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.


Next Story