జాక్వెలిన్ కు షాకిచ్చిన ఈడీ
ED attaches assets worth Rs 7 crore of Jacqueline Fernandez. సుఖేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు
By Medi Samrat Published on 30 April 2022 9:58 AM GMTసుఖేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఈడీ షాక్ ఇచ్చింది. జాక్వెలిన్‌కు చెందిన రూ 7.27 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో ఆమె పేరుతో ఉన్న రూ 7.12 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ సహా పలు ఆస్తులున్నాయి. మోసగించిన సొమ్ములో సుఖేష్ జాక్వెలిన్‌కు రూ 5.71 కోట్ల వరకూ బహుమతులుగా ఇచ్చాడని ఈడీ భావిస్తోంది. సుఖేష్ బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్, నోరాకు ఖరీదైన బహుమతులు ఇచ్చి వారిని ట్రాప్ చేశాడనే ప్రచారం సాగుతోంది. పలు కేసులలో సుఖేష్‌పై ఆరోపణలున్నాయి. ఢిల్లీ వ్యాపారి భార్య నుంచి రూ 215 కోట్లు అక్రమంగా తీసుకున్నందుకు సుఖేష్‌ను గత ఏడాది ఈడీ అరెస్ట్ చేసింది. సుఖేష్‌పై దర్యాప్తులో భాగంగా గత ఏడాది డిసెంబర్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈడీ ఎదుట హాజరవగా దర్యాప్తు ఏజెన్సీ ఆమెను ప్రశ్నించింది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సుఖేష్ చంద్రశేఖర్‌తో సంబంధాలున్నాయంటూ ఈడీ పలుమార్లు ఆమెను ప్రశ్నించింది. ప్రస్తుతం జాక్వెలిన్ ఈ కేసులో నిందితురాలు కాదు, కానీ దర్యాప్తు అధికారులు ఆమెకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. శ్రీలంకలో జన్మించిన ఆమెను దేశం విడిచి వెళ్లకుండా నిషేధించారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి భార్య నుంచి స్పూఫ్ కాల్స్ ద్వారా రూ.215 కోట్లు వసూలు చేసినట్లు సుఖేష్ చంద్రశేఖర్ పై ఆరోపణలు ఉన్నాయి. సుకేష్ ఢిల్లీ జైలులో ఉండగా.. ప్రధాని కార్యాలయం, న్యాయశాఖ, హోంశాఖకు చెందిన అధికారిగా నటిస్తూ బాధితురాలి నుంచి డబ్బులు వసూలు చేశాడు. బాధితురాలి భర్తకు బెయిల్ ఇప్పిస్తానని, వారి ఫార్మాస్యూటికల్ వ్యాపారాన్ని నడిపిస్తానని సుకేష్ ఫోన్ కాల్స్‌లో పేర్కొన్నాడు.