సినీ నటుడు సచిన్ జోషి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో హీరోగా ఎదగాలని ఆయన పెద్ద ప్రయత్నమే చేశారు. కానీ సక్సెస్ అవ్వలేకపోయారు. . గోవాలో విజయ్ మాల్యా సొంతమైన కింగ్ ఫిషర్ విల్లాను గతంలో జోషి కొనుగోలు చేశాడు. దేశవ్యాప్తంగా రెస్టారెంట్ లు, క్లబ్ లను కలిగివున్న ప్లేబాయ్ ఫ్రాంచైజీని కూడా నిర్వహిస్తున్నాడు. ఇక ఆ తర్వాత బండ్ల గణేష్ తో గొడవ కారణంగా వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత కూడా సచిన్ జోషిని ఎన్నో వివాదాలు వెంటాడాయి. వ్యాపారవేత్త కావడంతో వివాదాలు సచిన్ జోషిని చుట్టుముట్టాయి.
తాజాగా కూడా సచిన్ జోషి ఓ వివాదంలో ఇరుక్కున్నట్లు కథనాలు వచ్చాయి. సచిన్ జోషిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గత రాత్రి అరెస్ట్ చేశారు. ఈడీ విచారిస్తున్న ఓమ్ కార్ రియల్టర్స్ కేసులో జేఎం జోషి గ్రూప్ ప్రమేయాన్ని నిర్ధారించుకున్న ఈడీ అధికారులు, తదుపరి విచారణ కోసం సచిన్ జోషిని అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఓమ్ కార్ గ్రూప్ ప్రమోటర్లలో సచిన్ జోషి కూడా ఉన్నాడు. 100 కోట్ల రూపాయల నిధులను వీరు కాజేశారని ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 18 గంటల పాటు సచిన్ జోషిని విచారించిన ఈడీ అధికారులు, ఆపై అరెస్ట్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు