రజనీకాంత్ అభిమానులకు ఊహించని షాక్

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఊహించని షాక్ ఎదురైంది. ఆయన సినిమాల్లో ప్రత్యేకమైన సూపర్ హిట్ సినిమా

By Medi Samrat  Published on  9 Dec 2023 4:00 PM GMT
రజనీకాంత్ అభిమానులకు ఊహించని షాక్

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఊహించని షాక్ ఎదురైంది. ఆయన సినిమాల్లో ప్రత్యేకమైన సూపర్ హిట్ సినిమా శివాజీ రీ-రిలీజ్ వాయిదా పడింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానుల కోసం ఆయన పుట్టినరోజు కానుకగా శివాజీ సినిమాని రీ-రిలీజ్‌ చేయాలని నిర్ణయించారు. అయితే రీ-రిలీజ్ క్యాన్సిల్ అయినట్లు తాజా సమాచారం. రీ-రిలీజ్‌ల ట్రెండ్ క్రేజ్‌ను కోల్పోవడం.. పలు సినిమాల రీరిలీజ్ లకు వరుస నష్టాలు ఎదురవ్వడంతో శివాజీ రీ-రిలీజ్ కూడా వాయిదా పడింది.

కొన్ని నెలల క్రితం రీ-రిలీజ్‌ల ట్రెండ్ చాలా బాగా పనిచేసింది. తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన అనేక పాత చిత్రాలు మళ్లీ విడుదలయ్యాక సూపర్‌హిట్‌గా నిలిచాయి. రీసెంట్ గా రీ-రిలీజ్ లు మునుపటిలా వర్కవుట్ కాకపోవడంతో బయ్యర్లు భారీగా నష్టపోతున్నారు. ప్రేక్షకులు కూడా రీరిలీజ్‌లను చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్, బాలకృష్ణ భైరవ ద్వీపం కూడా రీ-రిలీజ్ చేద్దామని భావించారు.. అయితే అందుకు తగ్గట్టుగా క్రేజ్ లేకపోవడంతో రద్దు చేశారు. ఇప్పుడు శివాజీ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హిట్ సినిమా ముత్తు కూడా గత వారం రీ-రిలీజ్ కోసం ప్లాన్ చేశారు.. కానీ క్రేజ్ పెద్దగా లేకపోవడంతో రద్దు చేశారు. ఇప్పుడు బజ్ పెద్దగా లేకపోవడంతో శివాజీ రీ-రిలీజ్ కూడా వాయిదా పడింది.

Next Story