థియేటర్లలో మంచి విజయం సాధించిన ప్రదీప్ రంగనాథన్ కామెడీ-డ్రామా 'డ్రాగన్' OTTలో విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది. డ్రాగన్ సినిమా విజయంతో ప్రదీప్ కోలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
డ్రాగన్ మార్చి 28 నుండి తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ బ్లాక్‌బస్టర్ సినిమా ఇప్పటికీ థియేటర్లలో మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోంది. ఇప్పటివరకు దాదాపు 120 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలిస్తే, డ్రాగన్ సులభంగా 150 కోట్ల గ్రాస్‌ను సాధిస్తుంది. ఈ చిత్రం మరో 2-3 వారాల పాటు మంచి రన్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంచి ప్రదర్శన చేసింది. అశ్విన్ మారిముత్తు దర్శకత్వం వహించిన డ్రాగన్ సినిమాలో కయాదు లోహర్, అనుపమ పరమేశ్వరన్, జార్జ్ మరియన్, గౌతమ్ మీనన్, మిస్కిన్ తదితరులు నటించారు.