'ఆర్ఆర్ఆర్' నుంచి దీపావళి గిఫ్ట్.. చూడ‌డానికి రెండు క‌న్నులు చాల‌వుగా..!

Diwali Gift From RRR Movie Team. ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్‌. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌,

By Medi Samrat  Published on  13 Nov 2020 1:37 PM IST
ఆర్ఆర్ఆర్ నుంచి దీపావళి గిఫ్ట్.. చూడ‌డానికి రెండు క‌న్నులు చాల‌వుగా..!

ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్‌. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తుండ‌డంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. అందుకు త‌గ్గ‌ట్లే రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అల్లూరి సీతారామ రాజుగా రామ్‌చ‌ర‌ణ్‌.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే వీరిద్ద‌రికి సంబంధించిన టీజ‌ర్లు విడుద‌లై విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.



తాజాగా చిత్ర‌బృందం దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఫొటోను విడుదల చేశారు. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు పండుగ సందర్బంగా సాంప్రదాయ డ్రస్ ల్లో కనిస్తూ.. చిరున‌వ్వులు చిందిస్తున్నారు. తెలుపు రంగు దుస్తుల్లో దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు ఎన్టీఆర్, రామ్ చరణ్ కనపడ్డారు. సినిమా గురించి తారక్, చెర్రీకి రాజమౌళి వివరిస్తున్నట్లు ఓ ఫొటో ఉంది. వారి ముగ్గురి వెనుక ఆర్ఆర్ఆర్ అనే అక్షరాలు కనపడుతున్నాయి. రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ పేర్లు కలిసేలా ఈ సినిమా పేరు పెట్టిన విషయం తెలిసిందే.



ఈ ఫొటోలో వీరు కూర్చున్న సెటప్ మరియు జరుగుతున్న సంభాషణ చూస్తుంటే వీడియో కూడా ఏమైనా విడుదల చేస్తారేమో అనిపిస్తుంది. వీడియో వచ్చినా రాకున్నా ఈ ఫొటో మాత్రం ఈ ముగ్గురి అభిమానులకు అతి పెద్ద దీపావళి కానుకగా నిలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.


Next Story