చంద్రముఖి-2 వాయిదా పడడంపై షాకింగ్ కారణం చెప్పిన దర్శకుడు

చంద్రముఖి 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధంగా ఉంది.

By Medi Samrat  Published on  24 Sept 2023 8:55 PM IST
చంద్రముఖి-2 వాయిదా పడడంపై షాకింగ్ కారణం చెప్పిన దర్శకుడు

చంద్రముఖి 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధంగా ఉంది. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ముందుగా ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కావాల్సి ఉండగా,కొన్ని కారణాల వలన ఈ సినిమా సెప్టెంబర్ 28కి వాయిదా పడింది. గ్రాఫిక్స్ పనుల్లో జాప్యం కారణంగా సినిమా వాయిదా పడిందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఈ చిత్ర దర్శకుడు పి వాసు తాజా ఇంటర్వ్యూలో చంద్రముఖి 2 విడుదల తేదీల మార్పుకు కారణాన్ని బయటపెట్టారు.

చంద్రముఖి 2 తెలుగు ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ వచ్చింది. దర్శకుడు పి.వాసు సినిమా వాయిదా పడడానికి కారణాలను మీడియాకు చెప్పారు. సినిమా ఫైనల్ కాపీ సిద్ధమయ్యే సరికి 480 షాట్స్ మిస్ అయ్యాయని తెలిపారు. ఆ షాట్స్ ను తిరిగి సంపాదించడానికి 150 మంది టెక్నీషియన్స్ ఐదు రోజుల పాటు కష్టపడి తిరిగి తీసుకుని వచ్చారని అన్నారు. ఇప్పుడు ఆ సినిమా సీక్వెన్స్‌లను తీసుకుని వచ్చామని పి వాసు తెలిపారు.

Next Story