ప్రమోషన్స్ మొదలెట్టేశారు.. 'వకీల్ సాబ్' గా టైటిల్ మార్చాల్సి వచ్చిందట..!
Director Reveals About Vakeel Saab Title. వకీల్ సాబ్.. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా హిందీ 'పింక్' సినిమా
By Medi Samrat Published on 21 March 2021 6:40 PM ISTవకీల్ సాబ్.. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా హిందీ 'పింక్' సినిమా రీమేక్ అనే సంగతి అందరికీ తెలిసిందే..! ముఖ్యంగా మహిళల చుట్టూ ఈ కథ తిరిగేలా బాలీవుడ్ లో తెరకెక్కించారు. లాయర్ గా బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ నటించారు. కానీ తెలుగు రీమేక్ వచ్చే సమయానికి పవన్ కళ్యాణ్ నే పోస్టర్స్ లో ముఖ్యంగా చూపిస్తూ వెళుతున్నారు. దీంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. తెలుగులో పవన్ కు ఉన్న ఇమేజ్ ను బట్టి ఆయన క్యారెక్టర్ నిడివి ఎలాగూ పెంచేసి ఉంటారు. ఇక చాలానే మార్పులు కూడా చేసే ఉంటారని భావిస్తూ ఉన్నారు. ఇందులో పవన్ సరసన శృతి హాసన్ కథానాయిక కాగా, ముఖ్యపాత్రల్లో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల నటించారు.
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ వస్తోంది. వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ ఈవెంట్లతో బిజీగా ఉంది. 'వకీల్ సాబ్' దర్శకుడు వేణు శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ లో ఈ సినిమాకు మొదట వేరే టైటిల్ అనుకున్నామని వెల్లడించారు. వేణు శ్రీరామ్ మాట్లాడుతూ, ఈ చిత్ర కథ ప్రకారం తాము మొదట మరో టైటిల్ అనుకున్నామని వెల్లడించారు. 'మగువా' అనే టైటిల్ అయితే సరిపోతుందని భావించామని తెలిపారు.
పవన్ కల్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని 'వకీల్ సాబ్' అనే టైటిల్ ను ఖరారు చేశామని వివరించారు. పవన్ కళ్యాణ్ అంటే వయోభేదం లేకుండా అన్ని వయసుల వారు థియేటర్లకు తరలి వస్తారని, అందుకే పవర్ స్టార్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని సినిమాలో కొన్ని అంశాలను చేర్చామని తెలిపారు. కథ ఆత్మ దెబ్బతినకుండా పాటలకు స్థానం కల్పించామని, తమన్ చక్కని బాణీలు అందించారని అన్నారు.