దర్శకుడు SS రాజమౌళి RRR సినిమాలో ఒక తొలగించిన ఎపిసోడ్‌ను వెల్లడించాడు. జపాన్‌లో RRR స్క్రీనింగ్ కోసం హాజరయ్యారు.. అక్కడ ఆయన జపనీస్ ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సినిమా జపాన్ దేశంలో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇది విడుదలైనప్పటి నుండి జపనీస్ ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ ను అందుకుంటూ ఉంది.
రాజమౌళి మాట్లాడుతూ.. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, ఒలివియా మోరిస్ పాత్రల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఒలివియా మోరిస్ పోషించిన జెన్నీ పాత్ర మొదట్లో భిన్నంగా ఉండేదని.. ప్రారంభ వెర్షన్ ప్రకారం ఆమె రామరాజు (రామ్ చరణ్)ని రక్షించడానికి మొక్కలను వెతకడంలో భీమ్ (జూనియర్ ఎన్టీఆర్)కి సహాయం చేస్తుందని.. ఆ సమయంలో ఆమె బూట్లపై బురద పడుతుంది. ఇది గమనించిన ఆమె ఆంటీ జెన్నీని శిక్షించాలని అనుకుంటుంది. ప్రీ-క్లైమాక్స్ ఎపిసోడ్ సమయంలో, జెన్నీ అంకుల్.. భీమ్, రామరాజు ఇద్దరినీ లొంగిపోవాలని కోరతాడు.. కానీ అందుకు వాళ్లు ఒప్పుకోరు. దీంతో జెన్నీని చంపేస్తాడు. అలా ఆమె పాత్ర విషాదంగా ముగుస్తుంది. రాజమౌళి ఈ పాత్రకు విచారకరమైన ముగింపును కోరుకోలేదు. దీంతో టీమ్ ఈ భాగాన్ని మార్చింది. థియేట్రికల్ వెర్షన్ లో జెన్నీ చనిపోదు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు హమ్మయ్య జెన్నీని జక్కన్న చంపకుండా వదిలేశాడంటూ చెప్పుకొచ్చారు.