Video : అవి ముఖ్యమే కాదన్న దిల్ రాజు
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
By Medi Samrat Published on 26 Dec 2024 2:35 PM ISTటాలీవుడ్ నిర్మాత దిల్ రాజుతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బెనిఫిట్ షోలు రద్దు చేయడంతో పాటు పలు అంశాలపై ఇందులో చర్చించారు. మీటింగ్ అనంతరం ఆశ్చర్యకరంగా దిల్ రాజు మాత్రం బెనిఫిట్ షోలు, టిక్కెట్ల పెంపు తమకు ముఖ్యం కాదని చెప్పారు. బెనిఫిట్ షోలు లేదా టిక్కెట్ల పెంపుదల గురించి కాకుండా అనేక ఇతర సమస్యలను ముందుగా పరిష్కరించాల్సి ఉందని దిల్ రాజు అన్నారు. దిల్ రాజు నిర్మించిన కొత్త చిత్రం గేమ్ ఛేంజర్‌కి తెలంగాణలో ఎటువంటి బెనిఫిట్ షోలు లేదా టిక్కెట్ల పెంపుదల జరగదని, వ్యక్తిగతంగా అతనికి పెద్ద నష్టం వాటిల్లుతుందని భావించారు. కానీ ఆయన అవి ముఖ్యమే కాదని తేల్చేశారు. దిల్ రాజు ఈ ప్రకటన ఆసక్తికరంగా మారింది. సినిమా లాంగ్ రన్ కోసం ఆశించాలని దిల్ రాజు చెప్పడం విశేషం.
అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే దిల్ రాజును FDC చైర్మన్‌గా నియమించడాన్ని మేమందరం స్వాగతిస్తున్నామని రాఘవేంద్రరావు అన్నారు.
సంక్రాంతి సినిమాలు, బెనిఫిట్ షోలు చాలా చిన్న విషయాలు.. గవర్నమెంట్ పెద్దది.. సీఎం మాకు పెద్ద ఛాలెంజ్ ఇచ్చారు.. మేము దానికి రీచ్ అవ్వాలి - దిల్ రాజు pic.twitter.com/zNgSDoTH3z
— Newsmeter Telugu (@NewsmeterTelugu) December 26, 2024