దిల్ రాజు తన మాట నిలబెట్టుకున్నారా.?

ఈ ఏడాది సంక్రాంతికి ఏకంగా 6 తెలుగు సినిమాలు పోటీ పడిన సినిమాలు పోటీ పడిన సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on  27 Jan 2024 6:45 AM IST
దిల్ రాజు తన మాట నిలబెట్టుకున్నారా.?

ఈ ఏడాది సంక్రాంతికి ఏకంగా 6 తెలుగు సినిమాలు పోటీ పడిన సినిమాలు పోటీ పడిన సంగతి తెలిసిందే! అయితే వాటిలో రెండు సినిమాలు పక్కకు వెళ్లగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' సంక్రాంతి రేసు నుండి మొదట తప్పుకున్నాడు. అయితే సంక్రాంతి రేసు నుండి వాయిదా వేసుకోవాలని రవితేజ 'ఈగల్' సినిమా నిర్మాతలను ఇతర సినిమా నిర్మాతలు ఒప్పించారు. ఈగల్ వాయిదా వేస్తే మాత్రం.. సోలో రిలీజ్ కోసం ప్రయత్నిస్తామని ఫిల్మ్ ఛాంబర్ హామీ ఇచ్చింది. దీంతో DJ టిల్లు నిర్మాతతో మాట్లాడి.. ఫిబ్రవరి 9 నుండి మార్చి 29కి రిలీజ్ తేదీని వాయిదా వేశారు.

'ఊరు పేరు బైరవకోన' అనుకోకుండా ఫిబ్రవరి 9న విడుదల చేయాలని నిర్ణయించారు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో చర్చలు జరిపారు. దీంతో ఈగల్ సోలో రిలీజ్ కోసం తమ సినిమాను వాయిదా వేయడానికి నిరాకరించారు. అయితే ఫిలిం ఛాంబర్ ఊరు పేరు బరియవకోన టీమ్‌ని ఒప్పించినట్లు తాజాగా తెలుస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు ఫిబ్రవరి 16 న విడుదల కానుంది. ఈగల్ సినిమా సోలో విడుదలకు సిద్ధమవుతూ ఉన్నా.. అదే రోజున యాత్ర 2 కూడా విడుదలవుతోంది. ఇది రాజకీయ చిత్రం కావడంతో ఈగల్ మేకర్స్‌కు ఆ సినిమా రిలీజ్ డేట్ తో ఎటువంటి సమస్యలు లేనట్లు తెలుస్తోంది. ఇక అదే రోజున రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన లాల్ సలామ్ సినిమా కూడా విడుదల అవుతోంది. అయితే ఆ సినిమా తమిళ్ డబ్బింగ్ కావడంతో కమర్షియల్ సినిమాల అభిమానులు ఈగల్ సినిమాను మొదటి ప్రాధాన్యతగా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ చర్చల వెనుక దిల్ రాజు ప్రమేయం ఉందని తెలుస్తోంది. ఆయనే పలువురు నిర్మాతలతో చర్చించి.. ఈ రిలీజ్ అంశాన్ని చక్కదిద్దినట్లు తెలుస్తోంది.

Next Story