గేమ్ ఛేంజర్ 186 కోట్ల పోస్టర్‌పై స్పందించిన దిల్ రాజు
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలను తెచ్చింది.
By Medi Samrat Published on 2 Feb 2025 7:58 AM IST
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలను తెచ్చింది. పొలిటికల్ యాక్షన్ డ్రామా అయిన ఈ సినిమా సంక్రాంతికి కూడా మంచి కలెక్షన్స్ ను సాధించలేకపోయింది. సినిమా రిజల్ట్ కంటే, మొదటి రోజు పోస్టర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పుడు గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే పోస్టర్ పై దిల్ రాజు స్పందించారు. ఫలితాన్ని పక్కన పెడితే గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద 85 కోట్ల గ్రాస్ సాధించిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నిర్మాతలు సినిమా కలెక్షన్లకు దాదాపు 100 కోట్లు ఎక్కువగా, 186 కోట్ల పోస్టర్‌ను విడుదల చేసారు. ఇది వివాదాన్ని సృష్టించింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా పంపిణీదారుల కృతజ్ఞత సమావేశంలో, గేమ్ ఛేంజర్ 1 వ రోజు పోస్టర్‌పై దిల్ రాజు స్పందించారు. బ్రేక్ ఈవెన్ అయితేనే సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారని, నష్టపోయినప్పుడు కూడా సూపర్ హిట్ పోస్టర్స్ పడతాయన్నారు. సినీ పరిశ్రమలో ఇప్పుడు కల్చర్ మారిపోయింది. సినిమా ఇండస్ట్రీలో 10 శాతమే సక్సెస్ రేట్. 90 శాతం నష్టాలే ఉన్నాయి. ఇటీవల ఐటీ రైడ్స్ జరిగినప్పుడు 90 శాతం ఫ్లాప్స్ అని లాస్ట్ ఇయర్ షీట్ చూపించామన్నారు.
ఇదే ప్రెస్ మీట్ లో సీనియర్ డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుతూ సినిమా కలెక్షన్స్ గురించి నిజాలు చెప్పకూడదని, మా డిస్ట్రిబ్యూటర్స్ దరిద్రం కూడా అదే అన్నారు. నిజాలు చెప్తే నెక్స్ట్ సినిమా ఇవ్వరు. మేము బయటకెళ్లి మాట్లాడకూడదు. మేము డబ్బులు పోగొట్టుకున్నా పోయిందని చెప్పకూడదన్నారు.