తెలుగు చలనచిత్ర పరిశ్రమ అగ్ర నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిని కేటాయించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు ఆయన చేపట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేయగా, దిల్ రాజు రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పేరుతో దిల్ రాజు అలియాస్ వి.వెంకటరమణారెడ్డి భారీ బడ్జెట్, చిన్న బడ్జెట్ చిత్రాలను నిర్మించి ఇండస్ట్రీలో పలువురికి అవకాశాలు కల్పించారు. దిల్ రాజు పరిశ్రమలోని కొత్త, ప్రతిభావంతులైన వ్యక్తులకు మద్దతును ఇవ్వడానికి “డ్రీమ్స్” అనే కొత్త బ్యానర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి వెబ్‌సైట్ కూడా త్వరలో రానుంది. తెలంగాణ ప్రభుత్వం దిల్ రాజుకు ఒక కీలక బాధ్యతను అందించడం విశేషం.