మరో దక్షిణాది సినిమాకు దీపిక పదుకోన్ ఓకే చెప్పిందా..?
Did Deepika Padukone say OK to another southern film. దీపిక పదుకోన్.. కెరీర్ కన్నడ సినిమాతో మొదలు పెట్టినప్పటికీ..
By Medi Samrat Published on 27 Nov 2020 2:15 PM ISTదీపిక పదుకోన్.. కెరీర్ కన్నడ సినిమాతో మొదలు పెట్టినప్పటికీ.. 'ఓం శాంతి ఓం' సినిమాతో బాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్ళిపోయింది దీపిక. హాలీవుడ్ ఛాన్స్ లను కూడా దక్కించుకుంది. ఇక పాన్ ఇండియా సినిమాలు చేయాలని అనుకుంటున్న దక్షిణాది హీరోలు బాలీవుడ్ నటీమణుల వైపు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్ సినిమాలో దీపిక పదుకోన్ నటించబోతోందని అధికారికంగా ధృవీకరించారు. ఇప్పుడు మరో దక్షిణాది సినిమాలో దీపిక నటించే అవకాశం ఉందని అంటూ ఉన్నారు.
కోలీవుడ్‌లో ఇళయ దళపతి విజయ్ సరసన నటించడానికి దీపికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనే కథనాలు వస్తున్నాయి. హీరో విజయ్ కథానాయకుడిగా రూపొందనున్న ఓ చిత్రంలో దీపికాను కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారట. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం విజయ్‌కి 65వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో విజయ్‌కి ప్రతినాయకుడిగా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటించనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాని రూపొందించనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం శివకార్తికేయన్‌తో 'డాక్టర్' సినిమాని తెరకెక్కిస్తున్నారు నెల్సన్ దిలీప్‌కుమార్. ఆ సినిమా పూర్తయ్యాక విజయ్ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. విజయ్ నటించిన 'మాస్టర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే టీజర్ భారీ హిట్ అయ్యింది. దీపిక కూడా నాలుగైదు సినిమాలతో చాలా బిజీగా ఉంది.