వాస్తవాలు ధృవీకరించుకోండి..సీఎం రేవంత్‌కు బాలీవుడ్ నటి కౌంటర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బాలీవుడ్ నటి దియా మిర్జా మండిపడ్డారు.

By Knakam Karthik
Published on : 7 April 2025 12:37 PM IST

Telangana, Hyderabad, Gachibowli land issue, Dia Mirza, Cm Revanthreddy,

వాస్తవాలు ధృవీకరించుకోండి..సీఎం రేవంత్‌కు బాలీవుడ్ నటి కౌంటర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బాలీవుడ్ నటి దియా మిర్జా మండిపడ్డారు. హైదరాబాద్‌ కంచ గచ్చిబౌలిలోని చెట్ల నరికివేతకు సంబంధించి ఏఐతో సృష్టించబడిన నకిలీ వీడియోలను తాను షేర్ చేశానని సీఎం చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ మేరకు దియా మిర్జా ఎక్స్ వేదిగా స్పందించారు. తాను కంచ గ‌చ్చిబౌలి ప‌రిస్థితుల‌ను తెలియ‌జేసే న‌కిలీ ఏఐ ఫొటోలు/వీడియోలను ఉప‌యోగించాన‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్ప‌డం పూర్తి త‌ప్పుడు ప్ర‌క‌టన‌గా ఆమె పేర్కొన్నారు. తాను పోస్ట్ చేసినవి ఒరిజిన‌ల్ వీడియోలు అని 'ఎక్స్' వేదిక‌గా దియా మిర్జా స్పష్టం చేశారు. ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను ధృవీకరించాలని ఆమె ముఖ్యమంత్రిని కోరారు.

ఈ మేరకు ఆమె ఎక్స్‌లో ఇలా రాసుకొచ్చారు.. "తెలంగాణ ముఖ్యమంత్రి నిన్న ఒక ట్వీట్ చేశారు. కంచ గచ్చిబౌలి వద్ద పరిస్థితి గురించి ఆయన కొన్ని వాదనలు చేశారు. వాటిలో ఒకటి, ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమిపై జీవవైవిధ్యాన్ని కాపాడాలని విద్యార్థులు చేసిన నిరసనకు మద్దతుగా నేను నకిలీ ఏఐ రూపొందించిన చిత్రాలు/వీడియోలను ఉపయోగించానని అన్నారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రకటన. నేను ఏఐ రూపొందించిన ఒక్క చిత్రం లేదా వీడియోను కూడా పోస్ట్ చేయలేదు. నేను పోస్ట్ చేసినవి ఒరిజిన‌ల్ వీడియోలు. మీడియా, తెలంగాణ ప్రభుత్వం అలాంటి వాదనలు చేసే ముందు వాస్తవాలను ధృవీకరించుకోవాలి" అని దియా మిర్జా ట్వీట్ చేశారు.

Next Story