భారీ లాభాలు అందుకున్న 'సార్'

Dhanush's film breaks records. ధనుష్ హీరోగా నటించిన 'సార్' సినిమా మంచి కలెక్షన్స్ ను సాధించి హిట్ గా నిలిచింది.

By Medi Samrat  Published on  18 March 2023 2:16 PM GMT
భారీ లాభాలు అందుకున్న సార్

Dhanush's film breaks records


ధనుష్ హీరోగా నటించిన 'సార్' సినిమా మంచి కలెక్షన్స్ ను సాధించి హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ఇక ఓటీటీలో కూడా సందడి చేస్తోంది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో హారిక హాసిని బ్యానర్ మీద నిర్మితమైన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. మార్చి 17వ తేదీ నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో సందడి చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్ కి 23 కోట్ల 72 లక్షల షేర్ 45 కోట్ల 15 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా తెలుగు వర్షన్ కి నాలుగు వారాల్లో నైజాం ప్రాంతంలో ఎనిమిది కోట్ల 93 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. సీడెడ్ ప్రాంతంలో మూడు కోట్ల 15 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూడు కోట్ల 34 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 93 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో రెండు కోట్ల నాలుగు లక్షలు, గుంటూరు ప్రాంతంలో కోటి 63 లక్షలు, కృష్ణాజిల్లాలో కోటి 49 లక్షలు, నెల్లూరు జిల్లాలో 81 లక్షలు రాగా.. మొత్తం 22 కోట్ల 32 లక్షల షేర్ 42 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్ లో కోటి 40 లక్షలు వసూలు చేసింది.


Next Story
Share it