ధనుష్‌కు రెడ్ కార్డ్ జారీ చేసే ఆలోచనలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్..!

Dhanush lands into Trouble. తమిళ నటుడు ధనుష్ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

By Medi Samrat  Published on  1 July 2023 7:44 PM IST
ధనుష్‌కు రెడ్ కార్డ్ జారీ చేసే ఆలోచనలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్..!

తమిళ నటుడు ధనుష్ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సర్ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత ధ‌నుష్ త‌దుప‌రి ప్రాజెక్టుల‌ను లైన్‌లో పెట్టాడు. అయితే ఈ కార‌ణంగానే ధ‌నుష్ ఇబ్బందుల్లో ప‌డే అవ‌కాశం ఉంది. ఒప్పుకున్న సినిమాను పూర్తి చేయ‌ని కార‌ణంగా ద‌నుష్ ఇబ్బందుల్లో ప‌డనున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణ సంస్థ‌కు సినిమా చేస్తాన‌ని తాత్సారం చేయ‌డంతో స‌ద‌రు సంస్థ నిర్మాత‌ల మండ‌లిని ఆశ్ర‌యించినట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే వారు చ‌ర్య‌లకు ఉప‌క్ర‌మించ‌నున్న‌ట్లు స‌మాచారం.

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హీరో ధనుష్‌కి రెడ్ కార్డ్ జారీ చేసే ఆలోచనలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ సినీ ట్రేడ్ అన‌లిస్ట్ మ‌నోబాల విజ‌య‌బాల‌న్ ట్విట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. శ్రీ తేనాండాళ్ ఫిలింస్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్న ధనుష్‌.. ఆ చిత్రాన్ని పూర్తి చేయ‌లేదు. ఈ విష‌య‌మై నిర్మాతల‌ మండలి ధనుష్‌కి రెడ్ కార్డ్ జారీ చేయాలని ఆలోచిస్తుంది. ఇటీవల హీరోలు శింబు, విశాల్ తో పాటు న‌టుడు ద‌ర్శ‌కుడు ఎస్‌జే సూర్య తదితరులకు నిర్మాతల‌ మండలి రెడ్ కార్డ్ జారీ చేసిందని మ‌రో ట్వీట్ చేశారు.


Next Story