తమిళ హీరో ధనుష్‌, ఐశ్యర్య దంపతుల విడాకులు.. దయచేసి గౌరవించండి అంటూ..

Dhanush announces separation from wife Aishwarya Rajinikanth after 18 years together. తమిళ నటుడు ధనుష్, తన భార్య సినీ నిర్మాత ఐశ్వర్య రజనీకాంత్‌ దంపతులు విడిపోతున్నట్లు

By అంజి  Published on  18 Jan 2022 8:04 AM IST
తమిళ హీరో ధనుష్‌, ఐశ్యర్య దంపతుల విడాకులు.. దయచేసి గౌరవించండి అంటూ..

తమిళ నటుడు ధనుష్, తన భార్య సినీ నిర్మాత ఐశ్వర్య రజనీకాంత్‌ దంపతులు విడిపోతున్నట్లు సోమవారం రాత్రి ప్రకటించారు. వివాహమైన 18 ఏళ్ల తర్వాత విడిపోతున్నట్లు వారు తెలిపారు. ఐశ్యర్య సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె. కాగా విడాకులు తీసుకున్నట్లు ధనుష్, ఐశ్వర్య తమ తమ సోషల్ మీడియా ఖాతాలలో తెలియజేసారు. "18 సంవత్సరాల పాటు స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, ఒకరికొకరు శ్రేయోభిలాషులుగా కలిసిమెలిసి ఉన్నాం. ప్రయాణం ఎదుగుదల, అవగాహన, సర్దుబాటు, అనుకూలతతో సాగింది. ఇప్పుడు వేరు వేరు మార్గాల్లో నడిచేందుకు సిద్ధమయ్యాం. ఐశ్వర్య, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మంచి కోసం వ్యక్తులుగా మమ్మల్ని అర్థం చేసుకోవడానికి సమయాన్ని వెచ్చించండి. అంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన లేఖలో తెలిపారు.

ధనుష్ ట్వీట్ చేస్తూ.."దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. దీన్ని ఎదుర్కోవటానికి మాకు అవసరమైన గోప్యతను ఇవ్వండి. ఓం నమశివాయ! ప్రేమను పంచండి." అని ధనుష్ ట్విట్టర్‌లో క్యాప్షన్‌ పంచుకున్నారు. ఐశ్వర్య అదే నోట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనికి క్యాప్షన్ అవసరం లేదు...మీ అవగాహన, మీ ప్రేమ అవసరం!" అంటూ పేర్కొంది. నటుడు రజనీకాంత్ కుమార్తె ధనుష్, ఐశ్వర్య 2004లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు, యాత్ర, లింగలకు తల్లిదండ్రులు. వీరు వరుసగా 2006, 2010లో జన్మించారు. తమిళ రొమాంటిక్ థ్రిల్లర్ "3", బ్లాక్ కామెడీ "వై రాజా వై" వంటి చిత్రాలకు ఐశ్వర్య దర్శకత్వం వహించారు. ధనుష్ నిర్మాత కూడా. ఇటీవలే ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన హిందీ రొమాంటిక్ డ్రామా అత్రంగి రేలో కనిపించాడు. తమిళ చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కెరీర్‌ను కలిగి ఉన్నాడు.

Next Story