ఇన్‌స్టా లైవ్‌లో.. కన్నీళ్లు పెట్టుకున్న దీప్తి సునయన

Deepti Sunayana sheds tears live on Instagram. తాజాగా దీప్తి సునయన ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో ముచ్చటిస్తూ తమ లవ్‌ బ్రేకప్‌పై స్పందించారు

By అంజి  Published on  3 Jan 2022 9:24 AM GMT
ఇన్‌స్టా లైవ్‌లో.. కన్నీళ్లు పెట్టుకున్న దీప్తి సునయన

యూట్యూబ్ స్టార్స్, బిగ్‌బాస్ ఫేమ్ దీప్తి సున‌య‌న‌, ష‌ణ్ముఖ్ లు విడిపోతున్నార‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వార్త‌లు నిజ‌మేన‌ని దీప్తి సున‌య‌న చెప్పేసింది. త‌మ ప్రేమ బంధానికి పుల్‌స్టాప్ పెడుతున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. దీంతో 5 ఏళ్ల వీరి బంధానికి తెర‌పడింది. 'మా దారులు వేర‌ని అర్థ‌మైంది. ఇలాంటి క్లిష్ణ ప‌రిస్థితుల్లో మాకు మీ అండ ఎంతో అవ‌స‌రం. ద‌య‌చేసి మా వ్య‌క్తిగ‌త స్వేచ్చ‌కు భంగం క‌లిగించ‌ర‌ని కోరుకుంటున్నాం'. అంటూ దీప్తి సున‌య‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. అయితే తాజాగా దీప్తి సునయన ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో ముచ్చటిస్తూ తమ లవ్‌ బ్రేకప్‌పై స్పందించారు.

బ్రేకప్‌ పోస్టు పెట్టడానికి కారణమేంటని అడిగిన ఓ నెటిజన్‌ ప్రశ్నకు.. దీప్తి సమాధానం చెప్పారు. లైఫ్‌లో ఎప్పటికీ ఇలానే ఉండాలని లేదని, జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నానని, ఇప్పటి వరకు నా గురించి ఆలోచించుకోలేదని, నా జీవితం గురించి పట్టించుకోలేదని దీప్తి సునయన అన్నారు. ఇప్పుడు నాకు నేను ప్రేమించుకోవాలనుకుంటున్నానని, జీవితంలో రాణించాలనుకుంటున్నా, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతూ దీప్తి సునయన ఇన్‌స్టా లైవ్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీప్తికి నెటిజన్లు అండగా కామెంట్లు పెడుతున్నారు.


Next Story
Share it