ఉప్పూ.. పప్పూ నేనే ఆర్డర్ చేస్తాను : దీపికా

Deepika Padukone says that she manages her house herself. సాధారణంగా హీరోయిన్ల జీవితం అంటే వారికి కావలసిన వస్తువులు వారి దగ్గరికి వస్తాయని భావిస్తున్నాము. కానీ దీపికా ఉప్పూ.. పప్పూ కూడా తానే చూసుకుంటింది అంట.

By Medi Samrat
Published on : 21 Jan 2021 1:42 PM IST

Deepika

సాధారణంగా హీరోయిన్ల జీవితం అంటే వారికి కావలసిన వస్తువులు వారి దగ్గరికి వస్తాయని భావిస్తున్నాము. చుట్టూ ఎంతో మంది మేనేజర్లు, ఇంటినిండా నౌకర్లు, ఉంటూ వారికి కావలసిన ఏ చిన్న వస్తువు అయిన వారి దగ్గరికి వస్తుందని మనం భావిస్తాము. అయితే ఇది అందరి విషయంలో ఏమో కాని బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే విషయంలో మాత్రం ఇలా ఉండదని చెప్పవచ్చు. తన ఇంటి పనులను తానే స్వయంగా చూసుకుంటారు. అందరి స్త్రీల మాదిరి ఉదయమే లేచి తన ఇంటి పనులను చక్క పెట్టుకుంటారట దీపికా. ఈ విషయమే దీపికా ఓ సందర్భంలో మాట్లాడుతూ...

తన ఇంటి పనులు అన్నింటిని తానే చక్కబెట్టుకోవడం తనకు అలవాటుగా మారింది.చిన్నప్పటి నుంచి తను అదే విధంగా పెరిగిందని ఇప్పుడు మారడం కష్టం అని తెలియజేశారు. ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయో లేదో తానే స్వయంగా పర్యవేక్షిస్తూ కావలసిన ఉప్పు, పప్పు వంటి నిత్యావసర సరుకులను తానే స్వయంగా ఆర్డర్ చేసుకుంటానని తెలిపారు. నేనే ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉండటం చూసి రణవీర్ ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటాడు.

బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి విజయాలను అందుకుంటున్న సమయంలో కరోనా రావడం వల్ల వీరి స్పీడ్ కి బ్రేక్ పడింది. కరోనా రావడం వల్ల వారికి మంచే జరిగిందని, ఇద్దరం కలిసి కొంత సమయం స్పెండ్ చేశామని ఎంతో ఆనంద పడ్డారు. సినిమాల విషయానికి వస్తే నిజజీవితంలో భార్యాభర్తలుగా ఉన్న దీపికా పదుకొనే తెరపై కూడా భార్యాభర్తలుగా" 83" అనే సినిమాలో నటించారు. కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో రణవీర్ కపిల్ పాత్ర పోషించగా, దీపిక రోమిగా నటించారు. అయితే త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం తెలిపారు.


Next Story