హైదరాబాద్ లో అడుగుపెట్టిన దీపిక
Deepika Lands In Hyderabad For Prabhas Movie. బాలీవుడ్ నటి దీపిక పదుకోన్ హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్
By Medi Samrat Published on 4 Dec 2021 6:14 PM ISTబాలీవుడ్ నటి దీపిక పదుకోన్ హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ప్రాజెక్ట్ కె' చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ అందాలభామ దీపిక పదుకొణే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు దీపిక హైదరాబాద్ కు చేరుకుంది. ఆమెకు స్వాగతం పలుకుతూ చిత్రబృందం సోషల్ మీడియాలో స్పందించింది. రాణి గారికి స్వాగతం అంటూ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం ఓ సైన్స్ ఫిక్షన్ కథాంశంగా తెరకెక్కుతోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి ప్రస్తుతానికి 'ప్రాజెక్ట్-కె' అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు.
దీపిక పదుకోన్ భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ ఉంది. అద్భుతమైన లైనప్ సినిమాలకు ఓకె చెప్పింది దీపిక. ఈ ఉదయం ముంబై విమానాశ్రయంలో లావెండర్ సూట్ మరియు క్రాప్ టాప్‌తో స్టేట్‌మెంట్ హీల్స్‌తో హైదరాబాద్ కు చేరుకుంది. ప్రాజెక్ట్-కె సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో భారీ సెట్‌ను నిర్మించినట్లు సమాచారం. భారతదేశంలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ చిత్రం కోసం తన మొదటి షెడ్యూల్ పూర్తీ చేసుకున్న తర్వాత దీపిక ముంబై కు వెళ్లనుంది. దీపిక సహ-నిర్మాతగా ఉన్న కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన '83' సినిమాని ప్రమోట్ చేయనుంది. ఈ సినిమాలో భర్త రణ్‌వీర్ సింగ్ లీడ్ పాత్రలో నటించాడు. స్టార్ హృతిక్ రోషన్‌తో 'ఫైటర్' మరియు అమితాబ్ బచ్చన్‌తో 'ది ఇంటర్న్' రీమేక్ లో కూడా నటిస్తూ ఉంది దీపిక.