నాని నేషనల్ లెవల్ సినిమా 'దసరా'.. టీజర్ ఊర మాస్

Dasara Telugu Teaser. నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘దసరా’.

By Medi Samrat  Published on  30 Jan 2023 12:05 PM GMT
నాని నేషనల్ లెవల్ సినిమా దసరా.. టీజర్ ఊర మాస్

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘దసరా’. నానిని ఎప్పుడూ చూడని లుక్ లో మనం ఈ సినిమాలో చూడబోతున్నాం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేశ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న దసరా సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ మూవీలో నాని సిల్క్ స్మిత అభిమానిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. "నీయవ్వ.. ఎట్టైతె గట్లాయే గుండు గుత్తగా లేపేద్దాం.. బాంచెన్‌" అంటూ తెలంగాణ యాసలో డైలాగ్స్ తో అదరగొట్టేశాడు నాని. బొగ్గుగని బ్యాక్‌ డ్రాప్‌లో సాగే పక్కా మాస్‌ సినిమాలా దసరా ఉండబోతుందని టీజర్‌తో చెప్పేశాడు దర్శకుడు. తెలుగు టీజర్‌ను దర్శకుడు రాజమౌళి విడుదల చేయగా తమిళ్ లో హీరో ధనుష్, హిందీలో షాహిద్ కపూర్, మళయాళంలో దుల్కర్ సల్మాన్, కన్నడలో రక్షిత్ శెట్టి ఏకకాలంలో రిలీజ్ చేశారు.


Next Story