దసరా 5 రోజుల కలెక్షన్స్ ఇవే..!

Dasara Movie Collections. దసరా సినిమాతో నాని బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.

By M.S.R  Published on  4 April 2023 7:20 PM IST
దసరా 5 రోజుల కలెక్షన్స్ ఇవే..!

దసరా సినిమాతో నాని బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాతో తన కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ ను అందుకున్నాడు. విడుదలైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పాయింట్ ను అందుకుంది. ఈ సినిమా 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్ల షేర్ ను రాబట్టి ఇప్పటి వరకు మొత్తం రూ. 34 కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.92 కోట్ల గ్రాస్ ను రాబట్టినట్టుగా నిర్మాణ సంస్థ ఎస్ఎల్వీ సినిమాస్ తాజాగా ప్రకటించింది. యూఎస్ లోనూ ఇప్పటివరకూ 1.7 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. నేను లోకల్ తర్వాత నాని, కీర్తి సురేష్ దసరాతో జోడీ కట్టారు.

ఈ సినిమా విషయంలో ఎవరూ కూడా ఏ సీన్ ను ఎంజాయ్ చేస్తూ చేయలేదని ప్రతి సీన్ పెర్ఫెక్ట్ గా రావడం కోసం కష్టపడేవాళ్లమని నాని తెలిపాడు. ఎండలో, దుమ్ములో నానా ఇబ్బందులు పడ్డామని.. అలా పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్నే ఈ రోజున తాము చూస్తున్నామని నాని చెప్పుకొచ్చాడు.


Next Story