ఆ పాట భగవంత్ కేసరిలో.. రేపు చూడలేమా?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘భగవంత్ కేసరి’.

By Medi Samrat  Published on  18 Oct 2023 1:41 PM
ఆ పాట భగవంత్ కేసరిలో.. రేపు చూడలేమా?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘భగవంత్ కేసరి’. అక్టోబర్ 19న రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. 'రోర్ ఆఫ్ కేసరి' పాట గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇక సినిమాలో మోత మోగిపోవడం పక్కా అని అంటున్నారు.

ఈ మూవీలో బాలయ్య సూపర్ హిట్ సాంగ్ ‘దంచవే మేనత్త కూతురా’ని రీమిక్స్ చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా బాలయ్య చిన్న హింట్ ఇచ్చారు. అయితే సినిమాలో ఎప్పటి నుండి ఉంటుందో మాత్రం చెప్పలేదు. సినిమాలో ఈ పాట కోసం దాదాపు మూడున్నర కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఆ సాంగ్ ని రిలీజ్ రోజు చూడడం కష్టమని అంటున్నారు. ఫస్ట్ వీక్ పూర్తీ అయిన తరువాత సినిమాలో ఉంచనున్నారు. ఓల్డ్ సాంగ్ నుంచి కేవలం ‘దంచవే మేనత్త కూతురా’ అనే వోకల్స్ ని మాత్రమే తీసుకున్నారని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలకు బీజీఎంతో దుమ్ము దులిపాడు. ఈ సినిమాకు కూడా సూపర్ బీజీఎం ఉండబోతోందని చెబుతున్నారు.

Next Story