తెలుగు నిర్మాతల మండలి నూతన అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్

Damodara Prasad as the new President of Telugu Producers Council. తెలుగు నిర్మాతల మండలి ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. తెలుగు నిర్మాతల మండలి

By M.S.R  Published on  19 Feb 2023 8:15 PM IST
తెలుగు నిర్మాతల మండలి నూతన అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్

తెలుగు నిర్మాతల మండలి ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. తెలుగు నిర్మాతల మండలి నూతన అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ ఎన్నికయ్యారు. జెమినీ కిరణ్‌పై 17 ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్‌ విజయం సాధించారు. మొత్తం ఓట్లు 1,134 ఓట్లు కాగా, పోలైన ఓట్లు 677. వీటిలో దామోదర ప్రసాద్‌కు 339 ఓట్లు పోలవగా జెమినీ కిరణ్‌కు 322 ఓట్లు వచ్చాయి. నిర్మాతల మండలి కార్యదర్శులుగా ప్రసన్నకుమార్‌, వైవీఎస్‌ చౌదరి, జాయింట్ సెక్రటరీలుగా భరత్‌ చౌదరి, నట్టికుమార్‌ ఎన్నికయ్యారు.

దిల్ రాజు మద్దతుతో ఒక వర్గం, సి కళ్యాణ్ మద్దతుతో మరో వర్గం ఎన్నికల్లో దిగింది. దిల్ రాజ్ తన మద్దతుని దామోదర ప్రసాద్ కు ఇచ్చారు. సి కళ్యాణ్ తన మద్దతు జెమిని కిరణ్ కి ఉంటుందని అన్నారు. ఇక ఈరోజు ఉదయం మొదలైన ఎలక్షన్ పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగింది. నిర్మాతల మండలిలో మొత్తం 1134 ఓటర్స్ ఉండగా, పోలైన ఓట్లు కేవలం 678 మాత్రమే. నిర్మాతల మండలి ఎన్నికలు ప్రతి రెండేళ్ళకి ఒకసారి జరగాలి. కానీ కరోనా కారణంగా ఈసారి ఎలక్షన్స్ వాయిదా పడుతూ వచ్చాయి.


Next Story